అక్షరటుడే, భిక్కనూరు : మండలంలో వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ బీకేఎస్‌ నాయకులు మంగళవారం తహశీల్దార్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు వడ్ల కుప్పలపై కప్పేందుకు తాటిపత్రిలను అందించాలని కోరారు. కాంటా అయిన తర్వాత ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలన్నారు. అలాగే హమాలీల డబ్బులను ప్రభుత్వమే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. వండ్లు కాంటా చేసిన 48 గంటల్లో డబ్బులు చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో బీకేఎస్‌ మండలాధ్యక్షుడు మల్లేశ్‌ రెడ్డి, కార్యదర్శి కుంటయ్య, ప్రతినిధులు రాజిరెడ్డి, గంగారెడ్డి, శ్రీనివాస్‌, భూపాల్‌రెడ్డి, వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.