Pakistan | 214 మంది పాక్​ సైనికులను చంపేశాం: బలూచ్ లిబరేషన్ ఆర్మీ

Pakistan | ‘214 మంది పాక్​ సైనికులను చంపేశాం’
Pakistan | ‘214 మంది పాక్​ సైనికులను చంపేశాం’
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్: Pakistan |

Advertisement
బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) సంచలన ప్రకటన చేసింది. పాకిస్తాన్​కు చెందిన 214 మంది సైనికులను చంపేశామని తెలిపింది. బలూచ్​ తిరుగుబాటుదారులు ఇటీవల జాఫర్​ ఎక్స్​ప్రెస్​ రైలును హైజాక్​ చేసిన విషయం తెలిసిందే.

కాగా.. ఈ ఘటనలో తిరుగుబాటుదారులను హతం చేసి బందీలను విడుదల చేసినట్లు పాకిస్తాన్​ ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీనిని బీఎల్​ఏ ఖండించింది. తమ రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని కోరినా పాక్​ స్పందించకపోవడంతో.. జాఫర్​ ఎక్స్​ప్రెస్​ నుంచి బందీలుగా తీసుకున్న 214 మంది సైనికులను ఉరి తీశామని తిరుగుబాటు దారులు తెలిపారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Pakistan | పాకిస్తాన్‌లో ట్రైన్​ హైజాక్​.. ఆరుగురు సైనికుల హతం

Pakistan | ఖైదీల మార్పిడిని విస్మరించడంతో..

తిరుగుబాటుదారుల బృందం ప్రతినిధి జీయాంద్ బలోచ్ మాట్లాడుతూ.. ఖైదీల మార్పిడి కోసం విధించిన 48 గంటల గడువును పాకిస్తాన్ దళాలు విస్మరించాయని, ఫలితంగా సామూహిక ఉరిశిక్ష అమలు చేశామని పేర్కొన్నారు. రైలు హైజాక్​ సమయంలో 12 మంది తిరుగుబాటుదారులు చనిపోయారని తెలిపారు. కాగా దీనిపై ఇంకా పాకిస్తాన్​ ప్రభుత్వం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.