అక్షరటుడే, ఇందూరు: ఉపాధ్యాయులు రక్తదానం చేయడం అభినందనీయమని అదనపు కలెక్టర్ యాదిరెడ్డి అన్నారు. పీఆర్టీయూ
సంఘ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడమే కాకుండా సేవా కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు ముందుండడం స్ఫూర్తిదాయకమన్నారు. అనంతరం సంఘం సీనియర్ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మోహన్ రెడ్డి, వెంకటేశ్వర్ గౌడ్, జలంధర్, మురళి రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.