అక్షరటుడే, ఇందూరు : TNGOs NIZAMABAD | తలసేమియా బాధితుల(Thalassemia sufferers) కోసం టీఎన్జీవోస్(TNGOS) ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం(Blood donation camp) నిర్వహించడం అభినందనీయమని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పేర్కొన్నారు. టీఎన్జీవోస్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని గృహకల్ప కార్యాలయంలో శుక్రవారం మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటం చేస్తే టీఎన్జీవోస్ ప్రతినిధులు సేవాకార్యక్రమాల్లోనూ ముందుండడం అభినందనీయమన్నారు.
TNGOs NIZAMABAD | త్వరలో నిజామాబాద్లో రక్తదానం శిబిరం
ఉద్యోగులు ఆర్నెళ్లకొకసారి రక్తదానం((Blood donation) చేస్తే తలసేమియా బాధితులకు ఎంతో సేవ చేసినవారవుతారని టీఎన్జీవోస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ పేర్కొన్నారు. తలసేమియా బాధితుల కోసం రాష్ట్ర టీఎన్జీవోస్ శాఖ భారీ ఎత్తున రక్తదాన శిబిరం ఏర్పాటుచేయడం సంతోషకరమన్నారు. త్వరలో నిజామాబాద్లోనూ మెగా రక్తదానశిబిరం ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.
కార్యక్రమంలో ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర ఛైర్మన్, టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హుస్సేని (ముజీబ్), జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, ఆర్మూర్ యూనిట్ అధ్యక్షుడు శశికాంత్ రెడ్డి, భీమ్గల్ అధ్యక్షుడు సృజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.