Stock Market | స్టాక్‌ మార్కెట్‌లో బ్లడ్‌ బాత్‌.. భారీగా పడిపోయిన ఇండెక్స్‌లు

Stock Market | స్టాక్‌ మార్కెట్‌లో బ్లడ్‌ బాత్‌.. భారీగా పడిపోయిన ఇండెక్స్‌లు
Stock Market | స్టాక్‌ మార్కెట్‌లో బ్లడ్‌ బాత్‌.. భారీగా పడిపోయిన ఇండెక్స్‌లు

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Stock Market |  దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలతో ముగిశాయి. ఎఫ్ఎంసీజీ ఫైనాన్స్‌ రంగాలు మినహా అన్ని రంగాలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. గురువారం రాణించిన ఫార్మా (Pharma) సెక్టార్‌ సైతం శుక్రవారం భారీగా నష్టపోయింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో ఉదయం నష్టాలతో ప్రారంభమైన మన ఇండెక్స్‌లు తొలి అరగంటలో కోలుకుంటున్నట్లు కనిపించినా.. అమ్మకాల ఒత్తిడితో భారీగా పడిపోయాయి. ఉదయం 135 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్‌(Sensex) ఇంట్రాడేలో గరిష్టంగా 1,055 పాయింట్లు పడిపోయింది. 60 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన నిఫ్టీ.. గరిష్టంగా 393 పాయింట్లు నష్టపోయింది. చివరికి సెన్సెక్స్‌ 930 పాయింట్ల నష్టంతో 75,364 వద్ద, నిఫ్టీ(Nifty) 345 పాయింట్ల నష్టంతో 22,904 వద్ద స్థిరపడ్డాయి.

Advertisement
Advertisement

Stock Market | ఆ రెండు మినహాయింపు..

నిఫ్టీ మెటల్‌(Metal) ఇండెక్స్‌ 6.56 శాతం, ఫార్మా ఇండెక్స్‌ 4.03 శాతం, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రంగం 3.78 శాతం, ఎనర్జీ రంగం 3.73 శాతం, ఐటీ ఇండెక్స్‌ 3.58 శాతం నష్టపోయాయి. రియాలిటీ సెక్టార్‌ 3.60 శాతం, ఆటో సెక్టార్‌ 2.70 శాతం, ఇన్‌ఫ్రా సెక్టార్‌ 2.64 శాతం, పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 2.43 శాతం నష్టపోగా ప్రైవేట్‌ బ్యాంక్‌ ఇండెక్స్‌ స్వల్పంగా నష్టపోయింది. ఫైనాన్స్‌, ఎఫ్‌ఎంసీజీ(FMCG) సెక్టార్లు స్వల్ప లాభాలతో ముగిశాయి.

ఇది కూడా చ‌ద‌వండి :  stock market | లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. టారిఫ్‌ భయాలున్నా పైపైకి..

బీఎస్‌ఈలో 1129 కంపెనీలు లాభాలతో 2,815 కంపెనీలు నష్టాలతో ముగియగా 132 కంపెనీలు ఫ్లాట్‌గా ట్రేడ్‌ అయ్యాయి. 265 స్టాక్స్‌ అప్పర్‌ సర్క్యూట్‌ను తాకగా 221 స్టాక్స్‌ లోయర్‌ సర్క్యూట్‌ కొట్టాయి.

Stock Market | లాభపడినవి(Gainers)

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 30 ఇండెక్స్‌లో ఆరు కంపెనీలు మాత్రమే లాభాలతో ముగియగా 24 కంపెనీలు నష్టపోయాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, హెడీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒక శాతానికిపైగా పెరగ్గా నెస్లే, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఆసియా పెయింట్‌, ఐటీసీ స్వల్పంగా లాభపడ్డాయి.

Stock Market | నష్టపోయినవి (Losers)

టాటా స్టీల్‌ 8.59 శాతం నష్టపోయింది. టాటా మోటార్స్‌ 6.15 శాతం, ఎల్‌టీ 4.67 శాతం, అదాని పోర్ట్స్‌ 4.38 శాతం పడిపోయాయి. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, రిలయన్స్‌, సన్‌ఫార్మా, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌ మూడు శాతానికిపైగా నష్టంతో ముగిశాయి.

Advertisement