అక్షర టుడే, కామారెడ్డి గ్రామీణం: ప్రభుత్వం షరతులు లేకుండా బీడీ కార్మికులకు జీవన భృతి అమలు చేయాలని బీఎల్ టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్ డిమాండ్ చేశారు. సోమవారం దోమకొండ మండలకేంద్రంలో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సంజయ్ రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వారం రోజులుగా నియోజకవర్గంలో వేలాదిమంది బీడీ కార్మికులు ఆందోళనలు చేస్తున్నా.. స్థానిక ఎమ్మెల్యేకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం, బీఎల్ టీయూ నాయకులు సిద్ధ రాములు,ఆంజనేయులు, ఏఐఎఫ్ టీయూ రాష్ట్ర నాయకులు వెంకట్ లక్ష్మీ అనుసూయ, కె.లింగం, నాంపల్లి, శంశు, తదితరులు పాల్గొన్నారు.