Advertisement

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Blue Ghost అమెరికా ప్రైవేటు ల్యాండర్ చందమామపై విజయవంతంగా కాలుమోపింది. ఫైర్​ఫ్లై ఏరోస్పేస్​కు చెందిన ‘బ్లూ ఘోస్ట్’ సేఫ్టీగా ల్యాండ్​ కావడంతో.. చందమామపై సరైన స్థితిలో వ్యోమనౌకను దించిన తొలి ప్రైవేటు సంస్థగా ఫైర్​ఫ్లై ఏరోస్పేస్ చరిత్రలో నిలిచింది.

Blue Ghost: మొదటి సెల్ఫీ..

చందమామ కక్ష్య నుంచి ఆటోపైలట్ సాయంతో.. జాబిల్లి ఈశాన్య భాగంలోని పురాతన అగ్నిపర్వత ప్రాంతంలో బ్లూ ఘోస్ట్ కాలుమోపింది. ల్యాండింగ్ విజయవంతంగా జరిగినట్లు సంస్థ మిషన్ కంట్రోల్ కేంద్రం ప్రకటించింది.

పెద్ద శిలల వంటి అవరోధాలను తప్పించుకుంటూ సురక్షితమైన ప్రదేశంలో దిగింది. దిగిన అరగంటకు అది తొలుత సెల్ఫీ క్లిక్​ చేసి పంపించింది.

Blue Ghost: గురువారం మరో ల్యాండర్​..

టెక్సాస్​కు చెందిన ‘ఇంట్యూటివ్ మెషిన్స్’ సంస్థ ప్రయోగించిన ల్యాండర్ గురువారం జాబిల్లిపై దిగనుంది. దక్షిణ ధ్రువానికి 160 కిలోమీటర్ల దూరంలో ల్యాండర్​ దిగేలా శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement