అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) నూతన ఛైర్మన్ గా భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) సెక్రెటరీ జైషా ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. 35 ఏళ్ల వయసులోనే ఐసీసీ ఛైర్మన్ గా ఎన్నికైన అతి పిన్న వయస్కుడిగా జైషా నిలిచారు. భారత్ నుంచి గతంలో జగ్‌మోహన్‌ దాల్మియా, శరద్‌ పవార్‌, ఎన్‌.శ్రీనివాసన్‌, శశాంక్‌ మనోహర్‌ ఐసీసీ ఛైర్మన్లుగా పనిచేశారు.