అక్షరటుడే, ఇందూరు: తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు యూనియన్(ఐజేయూ) అనుబంధంగా ఏర్పాటు చేసిన జర్నలిస్ట్ రక్షణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ గా బొబ్బిలి నర్సయ్యను నియమించారు. ప్రస్తుతం టీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గా పనిచేస్తున్నారు. జిల్లాకు ప్రాధాన్యత ఇచ్చి తనకు బాధ్యతలు అప్పజెప్పిన రాష్ట్ర కమిటీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంజీవ్, కార్యదర్శి అరవింద్ బాలాజీ, కోశాధికారి ప్రసాద్ హర్షం వ్యక్తంచేశారు.