అక్షరటుడే, ఇందూరు: కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యమిస్తుందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. నగరంలోని పాత కలెక్టరేట్ మైదానంలో నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న డీఎస్ స్మారక క్రీడలకు బుధవారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వం క్రీడలను పట్టించుకోలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చాక స్టేడియాలపై దృష్టి సారించామన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కింద ఇప్పటికే మరమ్మతులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. జిల్లాలో నూతన స్టేడియం నిర్మాణానికి ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ మాట్లాడారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నగేష్ రెడ్డి, భక్తవత్సలం, ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు వేణు రాజ్, నిర్వాహకులు సాయిలు, పీఈటీ సంగం అధ్యక్షుడు విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

విజేతలు..

ఖో ఖో బాలుర జూనియర్ విభాగంలో పోచంపాడ్ టీజీఆర్ఎస్ గెలుపొందగా.. చందూర్ టీజీఆర్ఎంఎస్ రెండో స్థానంలో నిలిచింది. బాలికల విభాగంలో దాస్ నగర్ మహాత్మా జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ కాలేజీ మొదటి, పోచంపాడ్ టీజీఎస్‌డబ్ల్యూఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచాయి.

Advertisement