అక్షరటుడే, కోటగిరి: పోతంగల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో తనిఖీ చేశారు. పాఠశాలలో ఉపాధ్యాయులతో మాట్లాడి స్కూల్ లో పరిస్థితుల గురించి ఎంఈవో శంకర్ ను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు ఆయన గ్రామ పంచాయతీని సందర్శించారు. ఎంపీవోతో మాట్లాడి కుటుంబ సమగ్ర సర్వే పక్కగా నిర్వహించాలని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సూచించారు. ఆయన వెంట ఎంపీవో చందర్, ప్రధానోపాధ్యాయుడు సాయిలు ఉన్నారు.