అక్షర టుడే బోధన్ : డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకరికి జైలు శిక్ష పడినట్లు బోధన్ టౌన్ సీఐ వెంకటనారాయణ తెలిపారు. మద్యం తాగి వాహనం నడిపిన ఓ వ్యక్తిని పట్టుకొని సెకండ్ క్లాస్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పర్చగా రెండు రోజుల జైలు శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధించినట్లు ఆయన తెలిపారు.