అక్షరటుడే, వెబ్ డెస్క్: బోధన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ఏర్పడింది. బీసీ మహిళా రిజర్వ్ కోటాలో అంకు సంధ్యను నూతన చైర్ పర్సన్ గా ప్రభుత్వం నియమించింది. అలాగే వైస్ చైర్మన్ గా చిల్ల శంకర్, వివిధ మండలాలకు చెందిన 16 మంది సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.