అక్షరటుడే, బోధన్ : బోధన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమక్షంలో గురువారం ప్రమాణస్వీకారం చేశారు. కమిటీ చైర్‌పర్సన్‌గా అంకు సంధ్య, వైస్ చైర్మన్‌గా చీల శంకర్, డైరెక్టర్లు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. మార్కెట్ కమిటీ సభ్యులు కేసీఆర్‌లా మాటలు చెప్పకుండా రేవంత్ రెడ్డిలా పనిచేయాలని ఛలోక్తులు విసిరారు. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా రైతులందరికీ రూ.రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.లక్ష రుణమాఫీకి రైతులను ముప్పు తిప్పలు పెట్టిందని పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన మార్కెట్ కమిటీ సభ్యులు రైతులకు అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాజేశ్వర్, తహసీల్దార్ విఠల్, మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మాశరత్‌రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, పీసీసీ డెలిగేట్ గంగాశంకర్ తదితరులు పాల్గొన్నారు.