మున్సిపల్‌ కమిషనర్‌ను కలిసిన కాంగ్రెస్‌ నాయకులు

0

అక్షరటుడే, బోధన్‌: పట్టణ మున్సిపల్‌ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన నారాయణను సోమవారం కాంగ్రెస్‌ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన్ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శరత్ రెడ్డి, పట్టణాధ్యక్షుడు పాషా, కౌన్సిలర్లు, దాము, ఇమ్రాన్‌, సతీశ్‌, శ్రీకాంత్‌గౌడ్‌, అబ్దుల్లా, నాయకులు తలారి నవీన్‌, చిరంజీవి, హర్షద్‌ పాషా, విష్ణువర్ధన్‌రెడ్డి, ప్రమోద్‌ తదితరులు పాల్గొన్నారు.