అక్షరటుడే, బోధన్ : బోధన్ ఐదో అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేస్తున్న న్యాయవాది శ్యామ్ రావు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియామకమయ్యారు. నిజామాబాద్ జిల్లా ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా తాత్కాలికంగా నియమిస్తూ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఉత్తర్వులు జారీ చేశారు. బోధన్ న్యాయవాదులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.