అక్షరటుడే, కోటగిరి: భార్య హత్య కేసులో భర్తకు జీవిత ఖైదు విధిస్తూ బోధన్ కోర్టు జడ్జి అజయ్ కుమార్ శుక్రవారం తీర్పు వెల్లడించారు. కోటగిరి మండలం కొల్లూరు గ్రామానికి చెందిన నిమ్మల అంజని(45) సెప్టెంబర్ 2022లో హత్యకు గురయ్యింది. అప్పటి రుద్రూర్ సీఐ జాన్ రెడ్డి కేసు దర్యాప్తు చేపట్టారు. భర్త పోశెట్టి హతమార్చినట్లు గుర్తించారు. కాగా ఈ కేసులో న్యాయస్థానం తుది తీర్పు వెల్లడించింది. నిందితుడు పోశెట్టికి జీవిత ఖైదు విధించింది.
Advertisement
Advertisement