అక్షరటుడే, బోధన్: పౌర్ణమి రోజు అరుణాచలం గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తుల కోసం బోధన్ నుంచి బస్సు సౌకర్యం కల్పించినట్లు డిపో మేనేజర్ తెలిపారు. ఈ బస్సు 16వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు బోధన్ నుంచి బయలుదేరుతుందని పేర్కొన్నారు. వెళ్లే మార్గంలో కానిపాకం, వెల్లూరు గోల్డెన్ టెంపుల్ దర్శనం చేయిస్తారని తెలిపారు. గిరి ప్రదక్షిణ అనంతరం తిరుగు ప్రయాణంలో 18న జోగులాంబ దర్శనం ఉంటుందన్నారు. 19న బస్సు బోధన్ కు చేరుకుంటుందని వివరించారు. బస్సు ఛార్జి పెద్దలకు రూ. 4,400, పిల్లలకు రూ. 3,600 టికెట్ ఉంటుందని తెలిపారు. వివరాలకు 9951196134, 9985602789, 7382840367 నంబర్లను సంప్రదించాలని సూచించారు.