Advertisement
అక్షరటుడే, బోధన్: చెరుకు రైతుల సమావేశాన్ని శనివారం ఎడపల్లి మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్‌లో నిర్వహించనున్నట్లు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి తెలిపారు. చెరుకు రైతులు సమావేశానికి భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. నిజాంషుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సమావేశానికి ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, భూపతిరెడ్డిలతో పాటు కేన్ కమిషనర్ హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.
Advertisement