Advertisement

అక్షరటుడే, ఇందూరు:

Advertisement
విద్యార్థులు విద్యతో పాటు సాంకేతికతను జోడించి స్కిల్ డెవలప్​మెంట్​పై అవగాహన కలిగి ఉండాలని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. నగరంలోని ఉమెన్స్ కళాశాలలో మంగళవారం స్కిల్ డెవలప్​మెంట్​ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మారుతున్న కాలంతో పాటు విద్యా వ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయన్నారు. సర్టిఫికెట్లకే పరిమితం కాకుండా సాంకేతికతలో నైపుణ్యాన్ని సాధించాలన్నారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్, కళాశాల ఛైర్మన్ రాజేందర్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు పద్మనాభరెడ్డి, కిషన్ రెడ్డి, అబ్బన్న, ప్రిన్సిపాల్ భారతి, సహకార యూనియన్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి, అరికెల నర్సారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ రాం​చందర్​, తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Women's Day | నారీ.. నీకు వందనం..