అక్షరటుడే, బోధన్: నాణ్యమైన చేప పిల్లల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించామని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. మత్స్య అభివృద్ధి పథకం కింద మంగళవారం ఎడపల్లి మండలం అశోక్‌సాగర్‌లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి చేపపిల్లలను వదిలారు. జిల్లాలోని చెరువుల్లో చేపపిల్లలను వదిలేముందు మత్స్య కార్మిక సంఘాల సభ్యులు పరిశీలించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమి ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, ట్రెయినీ కలెక్టర్ సంకేత్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ అర్కల నర్సారెడ్డి, మత్స్యశాఖ జిల్లా అధికారి ఆంజనేయ స్వామి తదితరులు పాల్గొన్నారు.
మత్స్యకారులకు మంచి రోజులు: సుదర్శన్ రెడ్డి
Advertisement
Advertisement