త్వరలోనే నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ పునరుద్ధరిస్తాం

0

అక్షరటుడే, బోధన్: నిజాంషుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పరిశ్రమల శాఖ మంత్రి, నిజాం షుగర్స్ రివైవల్ కమిటీ ఛైర్మన్ శ్రీధర్ బాబు అన్నారు. నిజాంషుగర్స్ రివైవల్ కమిటీ శనివారం జిల్లాకు వచ్చింది. బోధన్ లోని ఫ్యాక్టరీ ఆవరణలో రైతులతో కమిటీ ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. తమది రైతుల ప్రభుత్వమని, రైతన్నల సంక్షేమానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. బీజేపీ నాయకులకు రైతుల సమస్యల పట్ల చిత్తుశుద్ధి లేదన్నారు. త్వరలోనే నిజాంషుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి కృషి చేస్తామని తెలిపారు. రైతులకు అవసరమైన కొత్త పరిశ్రమలను తీసుకొస్తామని, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ యంత్రాలు, భవనాల తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం కార్మికులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, మున్సిపల్ ఛైర్పర్సన్ పద్మ శరత్ రెడ్డి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.