అక్షరటుడే, కోటగిరి: పోతంగల్ మండలంలోని తిరుమలాపూర్ క్యాంప్ ప్రభుత్వ పాఠశాలను బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించారు. పాఠశాలకు ఎంతమంది హాజరయ్యారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపి మిగతా వారితో సమానంగా తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్ఎం అనిత, ఉపాధ్యాయులు ప్రశాంత్ కిరణ్ బాబు, ఝాన్సీ, శ్యామల తదితరులు పాల్గొన్నారు.