అక్షరటుడే, బోధన్ : బోధన్ తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు, ఉద్యోగులు సమయపాలన పాటించడంలేదు. శుక్రవారం ఉదయం 10.30 గంటలు దాటినా డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, ఇతర ఉద్యోగులు విధులకు హాజరుకాలేదు. దీంతో వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చిన ప్రజలు పడిగాపులు కాశారు. రెవెన్యూ అధికారుల పనితీరుపై తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయానికి పక్కనే ఆర్డీవో ఆఫీసు ఉన్నప్పటికీ.. మండల అధికారులు సమయపాలన పాటించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఉద్యోగులు సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.