అక్షరటుడే, వెబ్ డెస్క్: బోధన్ గ్రామాభివృద్ధి కమిటీ ఆదాయ వ్యయాల లెక్క తేలడం లేదు. నాలుగేళ్ల తర్వాత మంగళవారం వీడీసీ సమావేశం నిర్వహించగా రాత్రి వరకు కొనసాగింది. అకౌంట్లు పరిశీలించడంతో రూ.1.65 కోట్లలో రూ.65 లక్షలకు సంబంధించి లెక్క దొరకడం లేదు. దీంతో ఈ సొమ్ము ఎటు పోయిందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ విషయమై గ్రామాభివృద్ధి కమిటీ కోశాధికారిని ప్రశ్నించగా.. మరో రెండు రోజులు గడువు ఇచ్చినట్లయితే పూర్తి పద్దును ప్రజల ముందు ఉంచుతామని తెలిపారు. దీంతో శుక్రవారం వరకు సమావేశాన్ని వాయిదా వేశారు.