Advertisement

అక్షరటుడే, నిజాంసాగర్‌: మండలంలోని గోరుగల్‌ బేడీల మైసమ్మ ఆలయంలో ఆదివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయంలో అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అభిషేకాలు, ఓడిబియ్యం సమర్పించారు. సాయంత్రం బోనాలతో ఊరేగింపు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ పట్లోళ్ల జ్యోతి దుర్గారెడ్డి, వేద పండితులు సంజీవరావుతోపాటు దాతలను సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Advertisement