అక్షరటుడే, వెబ్ డెస్క్: భానుడి ఉగ్ర రూపానికి ఓ బాలుడు బలయ్యాడు. ఇందల్వాయి మండలం డొంకల్ తండాకు చెందిన అయిదేళ్ల బాలుడు రమావత్ అఖిల్ గురువారం వడదెబ్బతో మృతి చెందాడు. ఈ విషయాన్ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి అధికారులు ధృవీకరించారు. గురువారం బాలుడు బడికి వెళ్లగా అస్వస్థతకు గురయ్యాడు. వాంతులు చేసుకోగా నిజామాబాద్ జీజీహెచ్ కు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సన్ స్ట్రోక్ కారణంగానే బాలుడు మరణించినట్లు వైద్యులు స్పష్టంగా పేర్కొన్నారు. మరోవైపు గురువారం రాష్ట్రంలో ఎండల తీవ్రత రికార్డు స్థాయిలో నమోదైంది. 43 డిగ్రీలు దాటింది. ఈ ఘటనతో వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు.
వడదెబ్బతో అయిదేళ్ల బాలుడి మృతి
Advertisement
Advertisement