బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం

0

అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్ లో బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం అయ్యింది. మాలపల్లిలో ఇంటివద్ద ఆడుకుంటున్న ఏడేళ్ల బాలుడు మహమ్మద్ సల్మాన్ వాహజ్ గత నెల 30న అదృశ్యమయ్యాడు. అనంతరం తల్లిదండ్రులు ఒకటో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా సోహైల్ ఖాన్ అనే వ్యక్తి బాలుడిని బైక్ పైన తీసుకెళ్లినట్లు తేలింది. నిందితుడిని శుక్రవారం అదుపులోకి తీసుకొని విచారించగా.. బాలుడిని విక్రయించినట్లు బయటపడింది. హైదరాబాద్ లో బాలుడు ఉన్నట్లు గుర్తించి తిరిగి అతన్ని క్షేమంగా కుటుంబీకులకు అప్పగించారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన ఏసిపి కిరణ్ కుమార్, ఒకటో టౌన్ సీఐ విజయ్ బాబు బృందాన్ని సీపీ కల్మేశ్వర్ అభినందించారు. నిందితుడిని రిమాండ్ కు తరలించినట్లు అదనపు డీసీపీ జయరామ్ తెలిపారు.