కిడ్నాప్ అయిన బాలుడు క్షేమం

0

అక్షరటుడే, నిజామాబాద్: రూరల్ పీఎస్ పరిధిలో అపహరణకు గురైన ఏడాదిన్నర బాలుడి ఆచూకీ లభించింది. మోర్తాడ్ మండలంలోని ఓ కాల్వ పక్కన బాలుడిని గుర్తించినట్లు సమాచారం. ఓ బాలుడు అనుమానాస్పదంగా ఉన్నట్లు స్థానికులు మంగళవారం పోలీసులకు తెలియజేయగా.. మోర్తాడ్ పోలీసులు నిజామాబాద్ రూరల్ పీఎస్ కు సమాచారం ఇచ్చారు. కిడ్నాపర్లు బాలుడిని ఇక్కడ వదిలేసి పారిపోయినట్లు సమాచారం. గడిచిన వారం వ్యవధిలోనే మూడు కేసులు నమోదు కాగా.. ఈ మూడింటిని కూడా కమిషనరేట్ పోలీసులు చేధించారు.