అక్షరటుడే, నిజామాబాద్: నగరంలో మరో బాలుడు కిడ్నాప్ అయ్యాడు. తల్లికి మాయమాటలు చెప్పి ఏడాదిన్నర బాలుడిని ఓ వ్యక్తి అపహరించుకెళ్ళాడు. ఆదివారం రాత్రి ఈ ఘటన చేసుకోగా రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. కంటేశ్వర్ చౌరస్తాలో బిక్షాటన చేసుకొని జీవించే ఓ మహిళకు ఏడాదిన్నర బాబు ఉన్నాడు. ఆదివారం ఉదయం ఓ వ్యక్తి మహిళ వద్దకు వచ్చి మాటలు కలిపాడు. అనంతరం ఏడాదిన్నర బాబు గణేష్ ను అపహరించుకెళ్ళాడు. సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా అయిదు రోజుల్లోనే కమిషనరేట్ లో ఇది మూడో కిడ్నాప్ ఘటన కావడం కలకలం రేపుతోంది.