అక్షరటుడే, కామారెడ్డి టౌన్: రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉమెన్ రైట్స్ హెల్ప్ అసోసియేషన్ ప్రొటెక్షన్ కమిటీ తెలంగాణ అనుబంధ కార్యాలయాన్ని కామారెడ్డిలో ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా హ్యూమన్ రైట్స్ కామారెడ్డి జిల్లా మహిళా కో-ఆర్డినేటర్ లలిత మాట్లాడుతూ.. సమాజంలో మహిళలు, వృద్ధులు చిన్నారులపై జరుగుతున్న అన్యాయాలను ఎదిరించడానికి రైట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఉమెన్ రైట్స్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహమ్మద్ ఖలీల్ హుల్ల, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ ఛైర్మన్ ముదాం శంకర్, జిల్లా జనరల్ సెక్రెటరీ సుభాష్, వేముల బలరాం, రూప్ సింగ్, శ్రీనివాస్, నందకుమార్ తదితరులు పాల్గొన్నారు.