అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock market | దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుస లాభాలకు బ్రేక్ పడింది. బుల్స్‌పై బేర్స్ పైచేయి సాధించడంతో బుధవారం ఇండెక్స్‌లు(INDICES) భారీగా పతనమయ్యాయి. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సెన్సెక్స్.. ఇంట్రాడేలో గరిష్టంగా 150 పాయింట్లు పెరిగింది. ఆ తర్వాత ఇన్వెస్టర్(INVESTORS)లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో ఇంట్రాడే గరిష్టాలనుంచి 973 పాయింట్లు పడిపోయింది. చివరికి కాస్త కోలుకుని 728 పాయింట్ల నష్టంతో 77,288 వద్ద ముగిసింది. నిఫ్టీ 32 పాయింట్ల లాభంతో ప్రారంభమై గరిష్టంగా 68 పాయింట్లు లాభపడిరది. ఆ తర్వాత బేర్స్ పంజా విసరడంతో ఇంట్రాడే గరిష్టాలనుంచి 217 పాయింట్(POINTS)లు నష్టపోయింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి నిఫ్టీ 181 పాయిట్ల నష్టంతో 23,486 వద్ద స్థిరపడింది.
Stock market | అన్ని రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి..
ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఎనర్జీ, ఫార్మా, హెల్త్ కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లు ఇండెక్స్‌లను కిందికి లాగాయి. ఎఫ్‌ఎంసీజీ, ఇన్‌ఫ్రా, మెటల్ సెక్టార్లు కూడా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఆటో సెక్టార్ స్టాక్స్ మాత్రం ఫ్లాట్‌గా ముగిశాయి. మార్కెట్లలో సానుకూల అంశాలున్నా ప్రధానంగా ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు దిగడంతోనే మార్కెట్లు పడిపోయాయని భావిస్తున్నారు. బీఎస్‌ఈలో నమోదైన షేర్లలో 919 కంపెనీలు పెరగ్గా 3,115 కంపెనీలు నష్టపోయాయి. 109 కంపెనీలు ఫ్లాట్‌గా ఉన్నాయి.
Stock market | లాభపడ్డ స్టాక్స్ ఇవే….(GAINERS)
సెన్సెక్స్(SENSEX) 30 ఇండెక్స్‌లో 25 షేర్లు నష్టాలను చవిచూడగా.. ఐదు స్టాక్స్ మాత్రమే లాభపడ్డాయి. వరుసగా పతనాన్ని చూస్తున్న ఇండస్ ఇండ్ బ్యాక్ బుధవారం 2.94 శాతం పెరగ్గా హెచ్‌సీఎల్ టెక్, ఎంఅండ్‌ఎం, టైటాన్, పవర్‌గ్రిడ్ స్వల్పంగా పెరిగాయి.
Stock market | నష్టపోయిన స్టాక్స్ ఇవే..(LOSERS)
ఎన్టీపీసీ, జొమాటో షేర్లు 3 శాతానికిపైగా నష్టపోయాయి. టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్ స్టాక్స్ రెండు శాతానికిపైగా పడిపోయాయి. రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ వంటి హెవీవెయిట్ స్టాక్స్ కూడా నష్టాల బాటలో పయనించాయి.