Advertisement
అక్షరటుడే, వెబ్ డెస్క్: Minerva Grand : ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా తిరుపతి నగరంలోని మినర్వా గ్రాండ్ హోటల్‌లో ప్రమాదం సంభవించింది. గది నంబరు 314లో పీవోపీతో చేసిన సీలింగ్ కుప్పకూలింది. దీంతో ఆ హోటల్‌లో ఉన్న భక్తులు భయాందోళన చెందారు.
సీలింగ్ కూలడంతో ప్రజలంతా ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. అందులో బస చేసిన శ్రీవారి భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆ తర్వాత హోటల్ ను సీజ్ చేశారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement