అక్షరటుడే, వెబ్‌డెస్క్ : బ్రిటన్ దేశ మీడియా సంస్థ ‘ది గార్డియన్’ ఇకపై ఎక్స్‌వేదికగా ఎటువంటి పోస్టులు చేయబోమని ప్రకటించింది. ఎక్స్ సోషల్ మీడియాలో జాత్యహంకారం, కుట్రలతో పాటు కలవరపరిచే అంశాలు కనిపిస్తున్నాయని అందుకే బహిష్కరిస్తున్నట్లు పేర్కొంది. దీనిపై ఎక్స్‌అధినేత మస్క్ స్పందిస్తూ అవన్నీ అసంబద్ధమైన ఆరోపణలన్నారు. బ్రిటన్‌లో ‘ది గార్డియన్’ మీడియా సంస్థకు ఎక్స్‌లో 1.07 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అమెరికా ప్రభుత్వంలో ఎలన్‌మస్క్ కీలక బాధ్యతలు తీసుకోనున్న నేపథ్యంలో ఈపరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.