అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్‌: ఢిల్లీ లిక్కర్‌స్కాం కేసులో సుప్రీం కోర్టు ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌ మంజూరు చేయడంతో బీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబరాల్లో మునిగితేలుతున్నాయి. నగరంలోని కవిత ఇంటి వద్ద మంగళవారం మధ్యాహ్నం బీఆర్‌ఎస్‌, భారత్‌ జాగృతి నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా టపాసులు కాల్చి, స్వీట్లు పంచున్నారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ ఛైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు, నాయకులు అవంతి రావు, శ్రీనివాస్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.