అక్షరటుడే, ఆర్మూర్: నందిపేట్, డొంకేశ్వర్ మండలాలకు చెందిన పలువురు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కాంగ్రెస్ లో చేరారు.
బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, ఆర్మూర్ ఇంఛార్జి వినయ్ రెడ్డి సమక్షంలో ఆదివారం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన వారిలో మాజీ సర్పంచిలతో పాటు నాయకులు బోజారెడ్డి, గణేష్, దేవన్న, చందు, హరిదాస్, ధర్మన్న, సంతోష్ రెడ్డి, సంజీవ్ రాజ్, లక్ష్మీనారాయణ, లోక హన్మాండ్లు, మాన్పుర్ భూమేష్, నాగుల అశోక్, ఆయిల్ శ్రీను, రహమాన్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో యల్లా సాయిరెడ్డి, నందిపేట్ మండలాధ్యక్షుడు మంద మహిపాల్, డొంకేశ్వర్ మండలాధ్యక్షుడు భూమేష్ రెడ్డి, దేగం గంగారెడ్డి, కంఠం ఇంద్రుడు పాల్గొన్నారు.