అక్షరటుడే, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బీఎస్పీకి రెండు సీట్లు కేటాయిస్తూ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. పొత్తులో భాగంగా నాగర్ కర్నూల్, హైదరాబాద్ పార్లమెంట్ స్థానాలను బీఎస్పీకి కేటాయించారు. మిగతా 15 స్థానాల్లో బీఆర్‌ఎస్ బరిలో నిలవనుంది. కాగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూల్ స్థానం నుంచి పోటీ చేయనున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.