టోల్ ప్లాజా వద్ద పకోడీ తిని.. టీ తాగిన కేసీఆర్

0

అక్షరటుడే, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సుయాత్రలో భాగంగా ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద కాసేపు ఆగారు. మంగళవారం సాయంత్రం కామారెడ్డికి బయలుదేరిన ఆయన టోల్ ప్లాజా సమీపంలోని ఓ టీకొట్టు వద్ద ఆగి.. అక్కడ పకోడీ తిని టీ తాగారు. కేసీఆర్ ను చూసేందుకు ఆయన అభిమానులు, పార్టీ నాయకులు పెద్దఎత్తున అక్కడికి తరలి వచ్చారు. అనంతరం ఆయన కామారెడ్డికి బయలుదేరారు. కేసీఆర్ వెంట ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి, ఎంపీ సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇతర నాయకులు ఉన్నారు. రాత్రికి కామారెడ్డి రోడ్డు షోలో కేసీఆర్ పాల్గొననున్నారు.