Advertisement
అక్షరటుడే, ఆర్మూర్: కులగణన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం బోగస్ సర్వే చేపట్టిందని, బీసీలకు న్యాయం చేకూరేలా రీసర్వే చేపట్టాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. రీసర్వే చేస్తేనే బీసీల జనాభా తేలుతుందన్నారు. బీసీల ఓట్ల కోసం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి రాగానే వెన్నుపోటు పొడిచిందన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల హామీని రేవంత్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని, వారికి జరిగిన ద్రోహంపై ప్రజల్లో చర్చ జరగాలన్నారు.
Advertisement