అక్షరటుడే, వెబ్‌డెస్క్: KCR | బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ former Chief Minister KCR కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన శనివారం తన ఫామ్‌హౌస్‌లో ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల నేతలతో సమావేశమయ్యారు.
ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభను వరంగల్ (Warangal)లో నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ సభను విజయవంతం చేయాలని కేసీఆర్ ఆయా జిల్లాల నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు. శనివారం మూడు జిల్లాల బీఆర్ఎస్ నాయకులతో BRS leaders చర్చించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఉద్యమ పార్టీ బీఆర్‌ఎస్‌కే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తెలుసన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు ఏం కోల్పోయారో అర్థం చేసుకున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ Telangana ప్రజలకు పాలేవో.. నీళ్లేవో తెలిసిందన్నారు. సాగు, తాగునీరు, విద్యుత్ రంగాల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేసీఆర్ విమర్శించారు. వరంగల్‌లో నిర్వహించే రజతోత్సవ సభకు లక్షలాదిగా ప్రజలు తరలి వస్తారని కేసీఆర్ పేర్కొన్నారు.