అక్షరటుడే, ఆర్మూర్‌ : ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పట్టభద్రులు తమ ఓటును నమోదు చేసుకోవాలని బీఆర్‌ఎస్‌ నేత, ఓయూ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజారాం యాదవ్‌ అన్నారు. శనివారం పట్టణంలోని సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో ఓటరు నమోదు కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. విద్యార్థి, నిరుద్యోగుల కోసం పోరాడే వారినే ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలన్నారు. కార్యక్రమంలో జర్నలిస్టు ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల కృష్ణ, యాదవ సంఘం జిల్లా నాయకుడు లింగం యాదవ్, సీవీఆర్‌ కాలేజ్‌ కరస్పాండెంట్‌ గిరిరాజ్, ప్రిన్సిపాల్‌ జాకీర్, నవీన్‌ యాదవ్, శ్యాం యాదవ్, రాజేందర్, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.