అక్షరటుడే, ఇందూరు: కాంగ్రెస్ నాయకులు అనవసరపు మాటలు మాని.. అభివృద్ధిపై దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ నాయకుడు బాజిరెడ్డి జగన్ అన్నారు. మంగళవారం పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటనను ఓర్చుకోలేక డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పై ప్రజలకు నమ్మకం పోయిందని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రతిపక్షాలపై నోరు జారడం సమంజసం కాదన్నారు. కేసీఆర్ పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని, ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడిందని పేర్కొన్నారు. కేసీఆర్ పెట్టిన రైతుబంధు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేర్లను కొనసాగిస్తున్నారన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతూ భయపెట్టిస్తున్నారన్నారు. దేశంలో ఏ సీఎంపై లేనన్ని కేసులు రేవంత్ రెడ్డి పై ఉన్నాయని పేర్కొన్నారు. సమావేశంలో నగర అధ్యక్షుడు రాజు, సత్య ప్రకాష్, కుల్దీప్ సింగ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధిపై కాంగ్రెస్ నాయకులు దృష్టి పెట్టాలి
Advertisement
Advertisement