అక్షరటుడే, కామారెడ్డి/జుక్కల్ : శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నివాసంలో సమావేశానికి బీఆర్‌ఎస్ నాయకులు పిలుపునివ్వడంతో ఆ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ తరలివెళ్లకుండా మండలాల వారీగా శుక్రవారం ఉదయం అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్లకు తరలించారు. అరెస్టయిన వారిలో నిజాంసాగర్ మండల నాయకులు దుర్గారెడ్డి, విఠల్, రమేశ్ గౌడ్, సంగమేశ్వర్‌గౌడ్, అంజయ్య, సత్యనారాయణ, శ్రీకాంత్‌రెడ్డి, దేవేందర్ రెడ్డి, బేగరి రాజు, లింగాగౌడ్, పిట్లం మండలంలో వాసవి రమేశ్, నర్సాగౌడ్, శ్రీనివాస్ రెడ్డి, బిచ్కుందలో గణేశ్ గొండ, కామారెడ్డిలో మల్లన్నగారి భూంరెడ్డి, కౌన్సిలర్లు నజీరోద్దిన్, పిట్ల వేణుగోపాల్, గెరిగంటి లక్ష్మీనారాయణ, సంగి మోహన్, అన్నారం నరేశ్ రెడ్డి, షౌకత్ ఉన్నారు.