అక్షరటుడే, బాన్సువాడ: ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి విడుదల కావడంతో నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు బుధవారం సంబరాలు చేసుకున్నారు. టపకాయలు కాల్చి కవితకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్, మోచి గణేష్, రమేష్ యాదవ్, నర్సింలు గౌడ్, టేకుల సాయిలు, మోసిన్, మంగలి సాయిలు, గంగారాం, అన్వర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.