అక్షరటుడే, ఆర్మూర్: భీంగల్ మండల కేంద్రానికి చెందిన మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ మల్లెల రాజశ్రీ లక్ష్మణ్ కాంగ్రెస్ లో చేరారు. నిజామాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, బాల్కొండ ఇంఛార్జి సునీల్ రెడ్డి సమక్షంలో బుధవారం పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన వారిలో అంజుమ్ బాయ్, జీవరత్నం ఉన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోధిరే స్వామి, జెజె నర్సయ్య, పల్లె శేఖర్, కోరాడి లింబాద్రి, రంజిత్, సురేష్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.