అక్షరటుడే, ఆర్మూర్: బాల్కొండ మండలంలోని బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం కాంగ్రెస్లో చేరారు. వీరికి టీజీఎండీసీ ఛైర్మన్ ఈరవత్రి అనిల్, సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో నాయకులు రియాజ్, కాసీమ్, యూనుస్, మహమ్మద్ తదితరులున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనకు ఆకర్శితులై పార్టీలో చేరినట్లు తెలిపారు.