Advertisement
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telangana assembly | తెలంగాణ అసెంబ్లీ సంచలన నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. బడ్జెట్ సెషన్స్ పూర్తయ్యే వరకు ఆయనపై సస్పెన్షన్ కొనసాగుతుందని తెలిపారు. సభ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించగా.. బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేశారు.
Advertisement