అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Congress Govt | కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ BRS నేత, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి kottha prabhakar reddy సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు పారిశ్రామికవేత్తలు, బిల్డర్లు కాంగ్రెస్ congress ప్రభుత్వాన్ని పడగొట్టమని తమను కోరుతున్నట్లు ఆయన చెప్పారు. అవసరం అయితే డబ్బులు ఇస్తామని, ఎమ్మెల్యేలను కొనైనా కాంగ్రెస్‌ను కూలగొట్టమని చెబుతున్నారని వ్యాఖ్యలు చేశారు. కాగా ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.
Congress Govt | తాటాకు చప్పుళ్లకు భయపడం
కేసీఆర్ ఆలోచనల మేరకే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలుస్తామని వ్యాఖ్యలు చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి Ponguleti Srinivas Reddy అన్నారు. తాటాకు చప్పుళ్లకు ఈ ప్రభుత్వం భయపడదన్నారు. దమ్ముంటే ఎంతమంది ఎమ్మెల్యేలను కొంటారో కొనండి అని ఆయన సవాల్ విసిరారు. ధరణి Dharaniతో లబ్ధి పొందిన బీఆర్ఎస్ BRS బినామీలే ప్రభుత్వాన్ని కూల్చాలనుకుంటున్నారని ఆరోపించారు. భూ భారతి Bhu Bharati అమలుతో వారి బండారం బయటపడుతుందనే భయంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని పొంగులేటి విమర్శించారు.
Congress Govt | తక్షణం విచారణ జరపాలి
కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ Adi Srinivas , ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి Kiran kumar reddy స్పందించారు. ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే ఆరోపణలపై తక్షణం విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కోరారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ponnam prabhakar సైతం ఆయన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ప్రభుత్వాన్ని కూలుస్తుంటే తామేం చేతులు కట్టుకుని కూర్చోమని పేర్కొన్నారు.