అక్షరటుడే, వెబ్​డెస్క్​: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కులగణనపై మంగళవారం శాసనమండలిలో జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీ రిజర్వేషన్ల పెంచి ఎన్నికలు నిర్వహిస్తారా? లేదా? అనేది స్పష్టత ఇవ్వాలన్నారు. తమ ఇళ్లకు సర్వే చేయడానికి ఎన్యుమరేటర్లు రాలేదని ప్రజల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు అందాయని ఆమె పేర్కొన్నారు. వారి విషయంలో ఏం చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.