అక్షరటుడే, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆస్పత్రిలో చేరారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో మంగళవారం ఉదయం అడ్మిట్ అయ్యారు. ఆమెకు డాక్టర్లు వైద్య పరీక్షలు చేయనున్నారు. గైనిక్ సమస్యతో బాధపడుతున్న కవిత.. గతంలో తీహార్ జైలులో ఉన్న సమయంలో పలుమార్లు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన విషయం తెలిసిందే.